రెండో పెండ్లి ఆలోచనలో సురేఖావాణి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు రెండో పెళ్లి చేసుకొని సెంక్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నిర్మాత దిల్ రాజు, ప్రముఖ గాయని సునీత మరో పెండ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ జాబితాలో మరో టాలీవుడ్ సీనియర్ నటి చేరబోతున్న ఊహాగానాలు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా..? తన నటనతో చాలా మంది అభిమానులకు సంపాదించుకున్న సురేఖావాణి.
2019లో సురేఖావాణి భర్త సురేష్ తేజ అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచాడు. దీంతో సురేఖావాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఒంటరి జీవితానికి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేఖావాణి కుటుంబం ఆమెను మళ్లీ పెండ్లి చేసుకోవాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. సుప్రీత కూడా తన తల్లి సురేఖావాణిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తుందట. ఈ వార్త ఎంతమేరకు నిజమే తెలియదుగాని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.