రేపు కాళేశ్వరం పర్యటకు కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు (మంగళవారం) కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరింది. ఐదు నెలల విరామం తర్వాత కాళేశ్వరంలో మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్-1, 2లలో ఆదివారం గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు.
కాగా మంగళవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకోనున్నారు. అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సీఎం సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజ్. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసే ప్రాంతానికి ఎగువన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించారు.