రేపు యాదాద్రికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

హైదరాబాద్ (CLiC2NEWS): రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా రోడ్డుమార్గంలో యాదాద్రి బయల్దేరి 8:30 గంటలకు అక్కడకు చేరుకుంటారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొన్న అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆలయ పునర్ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు టెంపుల్ సిటీని సందర్శించిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.