రేపటి నుంచి శబరిమలలో 5 వేల మంది భక్తులకు అనుమతి

తిరువనంతపురం: రేపటి (ఆదివారం- డిసెంబరు,20) నుంచి శబరిమలకు రోజుకు 5 వేల మంది భక్తులను అనుమతి ఇవ్వనున్నారు. కేరళ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో భక్తులకు ఈ వెసులుబాటు కలిగింది. అయితే భక్తులు మాత్రం తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తీసుకువస్తేనే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీపీసీర్ రిపోర్టు తప్పనిసరి అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 2 వేల మందిని, శని, ఆదివారాల్లో 3 వేల చొప్పున భక్తులను అనుమతిస్తున్నారు. వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం దేవస్థానాన్ని నవంబర్ 15వ తేదీన సాయంత్రం తెరిచారు. ఈ పూజ రెండు నెలలపాటు కొనసాగనుంది.