రైతుల ఆదాయం రెట్టింపే ల‌క్ష్యం : ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక స‌మావేశాన్ని ఉద్దేశిస్తూ ఇవాళ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. రైతులు త‌మ పంట‌ల‌ను మండీలతో పాటు ఇత‌ర ప్ర‌దేశాల్లోనూ అమ్ముకోవ‌చ్చు అని, రైతులు త‌మ ఉత్ప‌త్తుల్ని డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ అమ్ముకునే సౌక‌ర్యం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, వారిని మ‌రింత స‌మృద్ధిగా మార్చ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.
ఒక రంగం అభివృద్ధి చెందితే…ఆ ప్రభావం మిగిలిన రంగాలపై కూడా ఉంటుందని అన్నారు. అలా కాదని, పరిశ్రమల మధ్య అనవసరమైన గోడలు నిర్మించుకుంటే ఏం జరుగుతుందో ఊహించుకోండని, ఏ పరిశ్రమ కూడా వేగంగా అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. అటు రైతులు చేపడుతున్న ఆందోళన దృష్ట్యా…తాము తీసుకువచ్చిన చట్టాలు సరైనవేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
వ్యవసాయ దాని అనుబంధ రంగాలైన వ్యవసాయ మౌలికసదుపాయాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్టోరేజ్‌, కోల్డ్‌ చైన్స్‌, కోల్డ్‌ చైన్స్‌ మధ్య అడ్డుగోడలు ఉన్నాయని, ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఆ అవరోధాలు తొలుగుతున్నాయని అన్నారు. ఈ సంస్కరణలు నూతన సాంకేతికత, నూతన మార్కెట్‌ను అందించడంతో పాటు వ్యవసాయంలో పెట్టుబడులను తీసుకురావడంతో సాయం చేయడంతో పాటు..రైతులకు లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు. వివిధ పరిశ్రమల్లోని అడ్డంకులపై మాట్లాడుతూ…భారత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే కావాల్సింది అడ్డుగోడలు కాదని, వంతెనలని, ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానించుకుంటాయంటూ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.