ర‌జ‌నీకాంత్ పార్టీ గుర్తుగా సైకిల్‌?

చెన్నై: త‌మిళనాట ఎవ‌రి నోటా విన్నా ఇప్ప‌డు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది.
వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీని ప్రారంభించ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే ర‌జ‌నీ ప్రారంభించ‌బోయే పార్టీ గుర్తును ఖ‌రారు చేసేందుకు ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. పార్టీ గుర్తుగా సైకిల్‌ను ఖ‌రారు చేస్తే ఎలా ఉంటుంది? అని ఇప్ప‌టికే స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ర‌జ‌నీ న‌టించిన అన్నామ‌లై చిత్రంలో సైకిల్, పాల క్యాన్ గెట‌ప్‌లో ఆయ‌న ద‌ర్శ‌నిమ‌చ్చారు. పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 31న వెల్లడిస్తామని ర‌జ‌నీ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా తన అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. తమ పార్టీ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని తలైవా స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.