రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే..
చెన్నైలో అభిమానుల భారీ ప్రదర్శన

చెన్నై: తమిళనాట ఎక్కడ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యం వలన రజనీ రాజకీయాలలోకి రాలేనంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. తాజాగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆయన అభిమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానంటూ ఇటీవల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. చెన్నైలోని వళ్లువార్ కొట్టమ్లో జరిగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది రజినీకాంత్ అభిమానులు పాల్గొన్నారు. మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజినీకాంత్ గత డిసెంబర్లో సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు.
Tamil Nadu: Members of Rajinikanth’s fan club stage demonstration at Valluvar Kottam in Chennai to request the actor to take back his decision not to enter politics. pic.twitter.com/sMfXGpNOkt
— ANI (@ANI) January 10, 2021