లంచం తీసుకుంటు దొరికిపోయిన కలెక్టర్

మెదక్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర ఎమ్మార్వో లంచం కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏకంగా రెండు కోట్లకు పైగా లంచం డిమాండ్ చేయటంతో పాటు కొటి 12 లక్షలను నగదు రూపంలో, మరో కోటి రూపాయల ప్రాపర్టీని తన పేరుకు మార్చాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం తీసుకున్నట్లు ఏసీబీ పసిగట్టింది. ఇందు కోసం చెక్కుతో పాటు ప్రాపర్టీని ఇప్పటికే నగేష్ వారి సంబంధికుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూవివాదం కేసులో నగేష్ ఆడియో క్లిప్స్ తో సహా దొరికిపోయినట్లు తెలుస్తోంది. దీంతో నగేష్ ఇండ్లు, ఆయన సంబంధీకుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ నగేష్ పట్టుబడ్డారు. నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్వోసీ కోసం రూ.1.12 కోట్లు డిమాండ్ చేశారు. రూ.1.12 కోట్ల డీల్‌లో భాగంగా నగేష్ రూ.40లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. మాచవరంలోని నగేష్ ఇల్లు సహా 12 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
నగేష్ భార్యను ఏసీబీ అధికారులు బోయిన్‌పల్లికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. రెండు గంటలుగా నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, తహశీల్దార్ మాలతీలపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నగేష్‌కు ఆర్డీఓ, తహశీల్దార్లు ఏ మేరకు సహకరించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. 112 ఎకరాల భూమికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నగేష్‌తో పాటు ఇంకెవరెవరికి వాటాలు ముట్టాయన్నదానిపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు.ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. చౌదరిగూడా ఆర్డీవో నివాసం, కొంపల్లి జేసీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు.