వకీల్ సాబ్: ‘సత్యమేవ జయతే’ వచ్చేసింది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న `వకీల్ సాబ్` నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. చెప్పినట్టే ఈ సినిమాలోని `సత్యమేవ జయతే` అనే పాటని ఇవాళ విడుదల చేసింది. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేవ్వర క్రియేషన్స్. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, తమన్ స్వరరచన చేశారు. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. శ్రుతీహాసన్ తో పాటు నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న రాబోతోంది.
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాలోని ‘సత్యమేవ జయతే’ రెండో పాటను బుధవారం విడుదల చేశారు. ఇప్పటికే ‘మగువా.. మగువా’ పాట అభిమానాలను అలరించగా.. తాజాగా విడుదలైన ‘సత్యమేవ జయతే’ పాట ఆకట్టుకుంటుంది.