వీరి పేర్లు జాబితాలో లేవు
డ్రగ్స్ కేసులో ఎన్సీబీ కీలక స్టేట్‌మెంట్

ముంబయి: హీరోయిన్ సమంత తన సహ నటీమణులు రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్‌కు క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే… డ్రగ్స్ కేసులో ఎన్సీబీ కీలక స్టేట్మెంట్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి, పలువురు ప్రముఖుల పేర్లను బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అంతేకాదు 14 రోజుల కస్టడీలో ఉన్న రియా 20 పేజీల వివరణాత్మక స్టేట్‌మెంటును ఎన్‌సీబీకి అందించారని, అందులో డ్రగ్స్ తీసుకుంటున్న 25 మంది సెలబ్రిటీల పేర్లను వెల్లడించారని… అందులో సారా అలీఖాన్‌తో పాటు రకుల్ ప్రీత్‌సింగ్, ఇలా ప్రముఖుల పేర్లు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ లిస్టు ఆధారంగా ఎన్సీబీ విచారణ మొదలు పెట్టిందన్నారు. ఈ ప్రచారం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ కలకలం రేపింది. ఒక్కసారిగా యావత్తు సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. అయితే ఇప్పుడు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా పేరిట తాజా ప్రకటన వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటులతో జాబితాను సిద్ధం చేయలేదని కేపీఎస్ మల్హోత్రా అన్నారు. అంతేకాదు రియా కూడా ఎవరి పేర్లు చెప్పలేదని తెలిపారు. ఇంతకుముందు కేవలం డ్రగ్ ఫెడరర్లు, ట్రాఫికర్లతో మాత్రమే లిస్టును రూపొందించామని, దీన్నే బాలీవుడ్ లిస్టుగా పొరపడ్డారేమోనని చెప్పారు. అసలు బాలీవుడ్ పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రకుల్, సారా పేర్లు లేవని తెలిసిన అభిమానులు `సారీ రకుల్`.. `సారీ సారా` అంటు పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ నటి అక్కినేని సమంత కూడా అందరి తరపున క్షమాపణలు చెప్పారు.
Comments are closed.