వ్యాక్సిన్ తీసుకున్న ర‌విశాస్త్రి

అహ్మ‌దాబాద్‌: ప్ర‌ధాని మోదీతోపాటు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, తెలంగాణ మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వాక్సిన్ తీసుకున్నారు. తాజాగా ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కోచ్ ర‌విశాస్త్రి మంగ‌ళ‌వారం ఉద‌యం కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్‌లో ఉన్న అత‌డు.. అక్క‌డి అపోలో ఆసుప‌త్రిలో టీకా తీసుకున్న ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. ఈ సంద‌ర్భంగా కరోనాకు వ్య‌తిరేకంగా కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది, సైంటిస్టుల‌కు అత‌డు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.