వ్యాక్సిన్ వేయించుకున్న నాగార్జున
హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్ ద్వారా తెలియజేశారు.
‘నేను కొవిడ్ టీకా మొదటి డోస్ తీసుకున్నాను. అర్హులైన అందరూ వ్యాక్సిన్ను తీసుకోవాలి. దీనికోసం ఆన్లైన్లో (cowin.gov.in) రిజిస్టర్ చేసుకుని, టీకా వేయించుకోవాలి’ అని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Got my #covaxin jab yesterday .. absolutely no down time👍😊I urge whoever is eligible to take the vaccine!!
You can now register for your #Covid19vaccine at https://t.co/Rm3ZUrv1Kx Book your vaccine. and get it done! #Unite2FightCorona#VaccineVarta@MoHFW_India @BMGFIndia pic.twitter.com/B4wjGoKLjx— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2021