`వ‌కీల్ సాబ్‌`కు మహేశ్‌బాబు ప్రశంసలు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `వ‌కీల్ సాబ్‌` చిత్రంపై న‌టుడు మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ ట్వీటర్‌లో ప్ర‌శంసించారు.

“వ‌కీల్‌సాబ్‌లో లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందన్నారు. ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో బ్రిలియంట్ గా నటించారు. ముఖ్యంగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటన మనసుకు హత్తుకునేలా న‌టించారు. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్. మొత్తం చిత్ర బృందానికి అభినంద‌న‌లు“ అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ పై ఇరువురి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఈ ట్వీట్ పై భారీ రెస్పాన్స్ రావటం విశేషం.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఈ నెల 9న విడుద‌లైన `వ‌కీల్‌సాబ్‌` బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సినిమా అద్భుతంగా ఉందంటూ ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సామాజిక మాధ్య‌మాల ద్వారా చిత్ర బృందానికి అభినంద‌న‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.