శ్రీవారిని దర్శించుకున్న నిహారిక దంపతులు

తిరుమల: నూతన దంపతులు నిహారిక కొణెదల, చైతన్య జొన్నలగడ్డ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యల వివాహ వేడుకను డిసెంబర్ 9న జైపూర్లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.