షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సోనూ సూద్

షిరిడి: ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూ సూద్ దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయ్యారు. దీనికి కారణం ఆయన కరోనా లాక్‌డౌన్ నుంచి చేస్తున్న ప్రజా సేవే. సోనూ ఎందరినో ఆదుకొని పలుమార్లు తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా మన రియల్‌హీరో సోనూ సూద్ షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. సోనూ రాకతో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రియల్ హీరో వచ్చారనే వార్త తెలియగానే భక్తులతో పాటు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు. సోనూని చూడగానే ‘రియల్ హీరో’ అంటూ నినాదాలు చేశారు. సోనూ అందరికీ సెల్యూట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయంలోనుండి బయటకు వచ్చిన తర్వాత కార్ ఎక్కి అక్కడివారికి అభివాదం చేశారు.