షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు.. విటమిన్ `ఎ`

విటమిన్ ఏ లోపించిన యెడల రేచీకటి, క్సిరోసిస్ కంజెక్టైనా, క్సిరోసిస్ కార్నియా, బైటాట్స్పాట్స్, కెరటో మలేషియా, మరియు పాలికులార్ హైపర్. థైయామిన్ లోపం వలన బెరిబెరి (కాళ్ళ పై వాపులు), గుండె పెరగటం, ఆయాసం, గుండె దడ, ఆకలి లేకపోవటం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, నడవటం కష్టంగా ఉండటంతో పాటు శరీరం శుష్కించి మాంసకండరాలు లేకుండా ఉండు స్థితి కనిపిస్తాయి
(తప్పక చదవండి:షేక్.బహర్ అలీ: మీ ఆరోగ్యము మీ చేతుల్లో)
విటమిన్ ఏ లభించు ఆహార పదార్దాలు
విటమిన్ ఏ ఎక్కువగా ఇది పచ్చని ఆకుకూరలతో దొరుకుతుంది. తోటకూర, బచ్చలి కూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, పుదీనా, కరివేపాకు ఇలా అనేక రకాలైన పచ్చని కూరలలో లభిస్తుంది. కాయకుారలలో కూడా క్యారట్, టమాటా, బొప్పాయి, మామిడి, గుమ్మడి ఇతర కాయకుారలలో లభిస్తుంది. చక్కని చూపుకు మరియు ఎముకల నిర్మాణానికి ఎ విటమిన్ చాలా అవసరం. విటమిన్ ఏ తగిన మోతాదులో ఉండాలి. అధికంగా విటమిన్ ఏ తీసుకుంటే ఎముకలకు హానిచేస్తుంది.
-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు