షేక్.బహర్ అలీ: శిశిర ఋతువులో చ‌క్క‌టి ఆరోగ్యానికి..

శిశిర ఋతువు లో ఆరోగ్య చిట్కాలు అందరికి చెపుతాను. అందరిని ఆరోగ్యంగా ఉంచాలన్నదే నా మనసులో భావన, అలాగే అందరితో నేను కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం చలికాలం శిశిర ఋతువులో ఆరోగ్యంగా ఎలా ఉండాలి. మరియు వ్యాధినిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి.తెలుసుకుందాం.

భారత దేశం చాలా గొప్ప దేశము. అందరు కలిసి చక్కగా జీవించే అవకాశం ఉన్న దేశం. ఎంతో అందమైన దేశం, అద్భుతమైన దేశం, చాలా సువిశాలమైన దేశం. ఇలాంటి భారతదేశంలో సంవత్సరానికి 6 ఋతువులు రెండేసి నెలలు (మాసము) ఒక ఋతువు అని అంటారు. అవి. 1.శిశిర. 2. వసంతం. 3. గ్రీష్మం. 4. వర్ష. 5. శరత్. 6. హేమంతము.

శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు ఈ మూడింటిని ఉత్తరాయణం అంటారు. ఈ కాలం నందు సూర్యుడు ఉత్తర దిశగా సంచరిస్తాడు. ఈ కాలం చాలా వేడిగా ఉంటుంది. ఈ కాలం బలం హరించే విధంగా ఉంటుంది.

1. పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. రాత్రి తిన్న ఆహారం చక్కగా ఆరుగుతుంది. శరీరానికి చక్కని బలం వస్తుంది.

2. రాత్రి త్వరగా నిదురించాలి. ఎవరికైనా మలబద్దకం ఉంటే, ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం, ఒక గ్లాస్ వేడి నీటిలో కలిపి తాగి పడుకోండి. లేదా ఆయుర్వేద షాప్ లో శుద్ధి చూర్ణం తెచ్చుకొని వాడండి. (మధుమేహం ఉంటే దీనిని వాడరాదు).

3. తేల్లవారుజామున లేవగానే కింద కూర్చొని రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగాలి. నిలబడి తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. తరువాత కాలకృత్యములు చేసుకోవాలి.

4. చక్కగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో ఒక దుప్పటి వేసుకొని యోగాసనములు చేయాలి.

1. సూర్యనమస్కారములు 6 సార్లు.

2. త్రికోణాసనం 3 సార్లు

3. పరివృత త్రికోణాసనం 3 సార్లు.

4. పార్శ్వ‌కోణాస‌నం 3 సార్లు.

5. పవన ముక్తాసనం 3 సార్లు. (1,2,3, మూడు గతులు చేయాలి)

6. శవాసనం 5 నిముషాలు వేసి విశ్రాంతి తీసుకోవాలి.

…….తరువాత

పార్ట్ 2 లో నిలబడి చేయు అసనములు.

1. తాడాసనం.

2. అర్ధకటి చక్రాసనం.

3. పాదహస్తాసనం

4. అర్ధ చంద్రాసనం

5. వృక్షాసనం

6. గరుడాసనం

అన్ని అసనములు 3 సార్లు చేయాలి.

2, కూర్చొని చేయు అసనములు.

1. వక్రాసనం

2. అర్ధ మత్స్యేంద్రాసనం

3. వజ్రాసనం

4. మండుకాసనం

5. శశాంకసనం

6. సుప్తవజ్ర్రాసనం

7. ఉష్ట్రాసనం

పొట్ట మీద ఆధారంగా చేసుకొని చేయు ఆసనములు.

1. శిథిలాసనం

2. భుజంగాసనం.

3. శలభాసనం. 1. 2.

4. మకారాసనం

5. ధనురాసనం

వీపు ఆధారంగా చేసుకొని చేయు అసనములు.

1. ఉత్తనపాదాసనం

2. నౌకాసనము

3. చక్రాసనము

4. మర్కాటాసనము

5. అర్ధ హలాసనం

6. హలాసనం

7. సర్వాంగాసనం

8. మత్స్యాసనం

9. శవాసనం
చేయాలి.

ప్రాణాయామం

1. భస్త్రిక

2. కాపాలభాతి

3. అనులోమ విలోమము

4. ఉజ్జయిని

5. భ్రమరి
చేయాలి.

చివరగా ధ్యాన ముద్ర వేయాలి.

తరువాత..

1. గోరువెచ్చని నీటితో స్నానము చేయాలి.

2. అల్పాహారం వేడి వేడిగా తినాలి.

3. మధ్యాహ్నం భోజనంకు ఉదయం టిఫినికి 4 గంటల వ్యవధి ఉండాలి.

4. సాయంత్రం గోరువెచ్చని నీటిలో నిమ్మరసంలో తేనే కలిపి తాగండి.

5. రాత్రి భోజనంకు మధ్యాహ్నం భోజనంకు 6 గంటల వ్యవధి ఉండాలి.

…………శిశిర ఋతువులు తినవాల్సిన ఆహార పదార్దాలు. గోధుమలు, తేనే, పాత బియ్యం మరియు మధుర, ఆమ్ల, లవణం రస ప్రధానమైన మరియు బలమైన ఆహారం తినాలి. ద్రాక్ష, చేరుకు రసములు, తీసుకోవాలి. వేడి నీరు తాగాలి. ప్రోటీన్స్ ఎక్కువగా వున్న పదార్దాలు పరిమితము గా తినవచ్చును. శరీరానికి నలుగు పెట్టుకోవాలి. ఆయిల్ మర్దన శరీరానికి చేయాలి.

-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.