షేక్.బహర్ అలీ : శంఖ ప్రక్షాళన యోగాసనములు

1. తాడాసనం చేయువిధానం…
చక్కగా నిలబడి రెండు చేతుల వేళ్ళు పరస్పరం కలిపి తలపైన ఉంచవలెను. కింద పాదములు కలిపి ఉంచాలి.

2. శ్వాసను ఊపిరితిత్తులలోకి తీసుకుంటూ పైకి నిటారుగా నిలబడవలెను. కాలి మడిమలు (హీల్)పైకి లేపుతూ కాలి వేళ్ళు అంటే పంజా ఐదు వేళ్ళ మీద నిలబడవలెను. తిరిగి శ్వాసను బయటికి వదులుతూ కిందికి రావలెను. చేతులు కిందకు దింపకుండా అర చేతులను తలపై ఉంచవలెను.ఇలా 3 నుండి 5 సార్లు చేయాలి.

2.తిర్యక్ తాడాసనం.. చేయువిధానం. పైన మొదటి దానివలె హస్తములు పైకి తీసుకొని పోయి వేళ్ళను ఒకదానియందు ఒకటి కలుపుచు పైకి చక్కగా లేపుచు స్థిరపరుచుము. అర చేతులు పై వైపునకు తెరచి ఉంచవలెను.పాదములు దాదాపు ఒక అడుగు ఎడమగా ఉంచాలి.

2. శ్వాసను ఊపిరితిత్తులలోకి తీసుకుంటూ కుడి వైపు మాత్రం వెనుక ముందుకు వంగకుండా ఎంతవరకు ప్రక్కకు వంగగలుగుదువో అంత వరకు హస్తములు వంచవలెను.మోచేతులు, హస్తములు వంచవలదు. శ్వాసను బయటికి వదులుతూ తల పైకి హస్తములను తేవలెను. ఇదే విధంగా ఎడమ వైపు నుండి కూడా చేయవలెను. ఇటులనే ఒకొక్క వైపు నుండి5 సార్లు చేయాలి.

3. కటి చక్రాసనం..
చేయు విధానం. నిటారుగా నిలబడి ఒక అడుగు దూరంలో రెండు కాళ్ళను జాపి నిలుచోవాలి. రెండు కాళ్ళు ఎదుటివైపుకు సమానాతరంగా సాగి ఉండాలి. రెండు చేతులను శరీరంతో సహా కదపాలి. కాళ్ళు మాత్రం స్థిరంగా ఉంచాలి. కుడి చెయ్యి నడుము వెనక, ఏడ చెయ్యి కుడి భుజం పైన ఉంచుకోవాలి. ఇలా రెండో వైపు చేయాలి. ఈ ఆసనాన్ని కుడి వైపు5 సార్లు, ఏడ వైపు5 సార్లు చేయాలి.

4. తిర్యక్ భుజంగాసనం..
చేయు విధానం. నెల మీద యోగ మ్యాట్ వేసి దాని మీద బోర్లా పడుకొని రెండు అర చేతులు ఛాతికి ఇరు పక్కల బయట వైపు నెలకీ ఆనించి ఉంచాలి. మోచేతులు తిన్నగా ఉంచుతూ శ్వాసను పీల్చుతూ ఛాతిని పైకి లేపాలి. దీనిలో మెడ మాత్రమే కదలిక ఉంటుంది. పైకి లేపి ఉంచిన మెడను నిదానంగా కుడి వైపు కి తిప్పి కుడి కాలి మడమను చూడాలి. మరల శ్వాసను విడుస్తూ యధా స్థితికి వచ్చి, మరల భుజంగాసనం వేసి మెడను ఎడమ వైపుకు తిప్పి ఎడమ కాలి మడమను చూడాలి. ఇలా 5 సార్లు చేయాలి.

5. ఉదరాకర్షణాసనం.. లేదా శంఖాసనం..
చేయువిధానం… చక్కగా కూర్చొని, రెండు చేతులు మోకాళ్లపైన ఉంచవలెను. పాదాములలో ఒకటి, ఒకటింపావు ఎడముండ వలెను.

2. శ్వాసను లోపల నింపుకొనుచు కుడి మోకాలుని ఎడమ పాదపు పంజా వద్ద నిలుపుము. మరియు ఎడమ మోకాలిని కుడివైపునకు కిందకు వంచుము.

2. మెడను ఎడమ వైపు నుండి వెనక వైపుకు త్రిప్పుకొనుము. వెనక వైపు చూడుము. 10 సెకన్లు అపిన తరువాత శ్వాసను వదిలి వేస్తూ మధ్యలోకి రావలెను. ఇదే విధంగా రెండోవ వైపు చేయాలి. ఇలా 5 సార్లు చేయాలి.

ఈ అసనములు గాలి పీల్చుతూ వదులుతూ కూడా చేయవచ్చును.

శంఖ ప్రక్షాళన వలన ప్రయోజనాలు.

1. సమస్త వ్యాధులకు,నివారణ జరుగును,వ్యాధులు రాకుండా చూడును.

2. శరీరంలో అంతరంగికంలో ఉన్న అవయవాలు అన్ని శుద్ధి అవుతాయి.శరీరంలో విషపదార్దాలు బయటికి వస్తాయి.శరీరం శుద్ధ నిర్మలంగా మారి పుష్యం వలె తేలికగా అవుతుంది. కాంతివంతం అవుతుంది.

3. ఉదర రోగాలు, మందాగ్ని, మలబద్దకం, ఏ సి డి టి, పులిత్రెపులు, ఆర్షరోగాలు, తగ్గిపోవును.

4. మూత్రపిండాలు, ప్రేగులు, ప్లిహం, వాటికి సంబంధించిన జబ్బులు తొలుగును.

5. బరువు తగ్గడం. హార్ట్ ప్రాబ్లెమ్, కడుపు నొప్పి, ముఖం, గొంతు సంబందించిన వ్యాధులు శ్వాస రోగాలు, తలనొప్పి, కంటి ప్రోబ్లేమ్స్ అన్నియు తగ్గును.

6. మహిళ మహారాణుల మాసిక ధర్మంకు సంబందించిన వికృతులు తెల్లబట్ట, నెలసరి సమయంలో నొప్పి బాగా రావటం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, వస్తే అధిక రోజులు రావటం తగ్గును.వాత నొప్పులు, మోకాళ్ళ, నడుము, నొప్పి తగ్గును. వెంట్రుకలు నల్లగా మారును. కంటి కింద మచ్చలు, మడతలు తగ్గును. చర్మం సౌందర్యంగా తయారు అవుతుంది.

…దీనిని గురువుగారి సమక్షంలో నేర్చుకోవాలి. స్వంత ప్రయత్నాలు చేయవద్దు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, అందరూ చేయవచ్చును.

హెచ్చరిక: దీనిని చేసిన తరువాత వెంటనే శవాసనం వేసి తడి గుడ్డ పొట్ట పైన పట్టిగా వేసి ఉంచాలి. 30 నిముషాలు పండుకొని శవాసనం చేయాలి. దరిదాపు ఈ రోజు ఖిచిడి మాత్రమే రెండు పూటల ఆవు నెయ్యి వేసుకొని తినాలి.

2 .శంఖ ప్రక్షాళన చేసిన రోజు బయటికి వేళ్ళవద్దు. బరువులు లేపవద్దు. ఈ రోజు ప్రశాంతంగా ఉండాలి.

-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు

 

Leave A Reply

Your email address will not be published.