షేక్.బహర్ అలీ: హస్త పాదోత్తానాసనం..

చక్రాసనానికి ఇది ఒక ఉప ఆసనం. చక్రాసనంలో శరీరాన్ని పైకి లేపితే, ఇందులో శరీరాన్ని ముందు వైపుకు వంచుతాం. ఇందులో చేతులను కాళ్ళను పైకి లేపి పిరుదుల పైన నిలపెట్టటం జరుగుతుంది.
చేసే విధానం.
ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. మోకాళ్ళను తిన్నగా చాపి మడమలను, పంజాలను కలిపి లాగాలి. చేతులను శరీరానికి అనించాలి. అర చేతులు భూమి వైపు ఉండాలి. రెండు చేతులను లాగి పట్టాలి. శ్వాసను నింపుతూ పంజాలను, శరీరాన్ని మెల్ల మెల్లగా పైకి ఎత్తాలి. పిరుదులపైన శరీరాన్ని నిలుపుతూ చేతులను కూడా కాళ్ళ వైపు జాపాలి. కొద్దీ సేపు ఈ స్థితిలో ఉండటానికి శ్వాసను సామాన్యంగా ఉంచుకోవాలి. శ్వాసను వదులుతూ యధాస్థితికి రావాలి. శరీరాన్ని వదులుగా చేసి విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానకేద్రం. మణిపూర చక్రం.
కాళ్ళను, చేతులను ముందుకు చాపినపుడు అవి కనిపించకూడదు.
(తప్పకచదవండి: షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు.. విటమిన్ `ఎ`)
ప్రయోజనాలు
1. పంజాలు, పిక్కలు, తొడలు, చిలమండలములు, పిరుదులు, పొట్ట,నడుము, మణికట్టు, ఈ అంగాలన్ని చక్రాసనానికి విపరీత దిశలో ప్రభావితం అవుతాయి.
2. జారిన నాభిని యధా స్థాననికి తేవడానికి ఇది రామాబాణం లాంటిది.
3. నాభి జారిన తరువాత మీరు ఎన్ని మందులు వాడినా సరే నొప్పి తగ్గదు. ఈ ఆసనంతో నాభి నొప్పి పటాపంచలు అయిపోయి నొప్పి పూర్తిగా తగ్గుతుంది.
4. శరీరంలోని సమస్త అవయవాల, కండరాల మధ్య పరస్పర సమన్వయం పెరుగుతుంది.
5. నాభి ప్రభావానికి లోను కావటం వలన మలబద్దకం పోతుంది.
6. హెర్నియా రోగులకు ఈ ఆసనం లాభకారిగా ఉంటుంది.
-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు