సంతోశ్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

సూర్యాపేట (CLiC2NEWS): చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కర్నర్ సంతోశ్‌బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి కెటిఆర్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో సంతోశ్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సంతోశ్‌బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. సిఎం హామీ మేరకు రూ.20 లక్షల వ్యయంతో సంతోశ్‌బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
లద్దాఖ్‌లో వెంట గతేడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబుతో పాటు మరికొంతమంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.