సమైక్య భారతి తెలంగాణ అధ్యక్షునిగా రామిశెట్టి వెంకటసుబ్బారావు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక సేవా సంస్థ అయిన సమైక్య భారతి కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రముఖ పారిశ్రామికవేత్త రామిశెట్టి వెంకట సుబ్బారావు నియమితులయ్యారు. ఆయన నెల్లూరు జిల్లా కావలికి చెందిన వారు. గత మూడు దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో పరిశ్రమలు స్థాపించి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తార్నాకలో ఆయన నివాసం ఉంటున్నారు. గత దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జనసేనకు అడ్వైజర్ గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల తెలంగాణ కాపునాడు అధ్యక్షులు కటారి అప్పారావు, ఏపీ కాపునాడు అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. గొప్పదాత రామిశెట్టి వెంకట సుబ్బారావు తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. రామిశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.