టిజిఎస్‌డిసిఎల్‌లో 8 మంది అవినీతి అధికారుల సస్పెన్షన్
హైదరాబాద్ (CLiC2NEWS): టిజిఎస్‌పిడిసిఎల్ లో ఒకేసారి 8 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు తేలడంతో బుధవారం అవినీతి ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎడిఇలు, ఎఇలు, సబ్ ఇంజినీర్లు ఉన్నారు. యాంటి బ్రైబరీ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు వంటి వాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసున్నట్లు వెల్లడైంది. వీరు లంచాలను ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు స్వీకరించినట్లు ఆధారాలు లభ్యమవడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.