సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అలహాబాద్: సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. మేజర్ అయిన ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించడమనేది వారి హక్కని పేర్కొంది. వారి స్వేచ్ఛను హరించడానికి వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ హక్కు లేదని పేర్కొంది. వారికి రక్షణ కల్పించాల్సిందిగా ఫరూఖాబాద్ ఎస్ఎస్పీని ఆదేశించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫరూఖాబాద్‌కు చెందిన కామినీ దేవి, అజయ్ కుమార్ జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాము ఇద్దరం మేజర్లమని, ప్రేమించుకుంటున్నామని కలిసి జీవిస్తున్నామని రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, తనను తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారని, వేరే అబ్బాయితో పెళ్లికి బలవంతం చేస్తున్నారంటూ కామినీ దేవి తన పిటిషన్‌లో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రకాశ్ పడియా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. రాజ్యాంగం ప్రసాధించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. ఇదే సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిందిగా ఫరూఖాబాద్ ఎస్ఎస్పీని ఆదేశించింది అలహాబాద్ హైకోర్టు.

Leave A Reply

Your email address will not be published.