సింగరేణిలో 372 ట్రైనీ ఉద్యోగాలు

హైదరాబాద్‌: తెలంగాణ‌లోని బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణిలోని వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరింది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 22
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 4
వెబ్‌సైట్‌: www.scclmines.com

తాజాగా సింగ‌రేణి సంస్థ వెల్ల‌డించిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 372 ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు లోకల్‌, నాన్‌లోకల్‌ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జూనియర్‌స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

372 పోస్టులకు సంబంధించిన వివ‌రాలు.

  • ఇందులో ఫిట్టర్‌- 128 (లోకల్ 105, జనరల్ 23)
  • ఎలక్ట్రిషియన్- 51 (లోకల్ 43, జనరల్ 8)
  • వెల్డర్‌-54 (లోకల్‌ 44, జనరల్‌10)
  • టర్నర్‌ లేదా మెషినిస్ట్‌ ట్రైనీ- 22 (లోకల్‌ 18, జనరల్‌ 4)
  • మోటార్‌ మెకానిక్‌ ట్రైనీ-14 (లోకల్‌ 12, జనరల్‌ 2)
  • ఫౌండర్‌ మెన్‌/మౌల్డర్‌ ట్రైనీ-19 (లోకల్‌ 16, జనరల్‌ 3)
  • జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌-84 (లోకల్‌ 67, జనరల్‌ 17)
  • జూనియర్‌ స్టాఫ్‌నర్స్‌ మినహా మిగిలిన పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు చేసేటప్పుడు సర్టిఫికెట్ల సాఫ్ట్‌కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలి.
Leave A Reply

Your email address will not be published.