సిఎం కెసిఆర్‌కు య‌శోద ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర‌రావుకు గురువారం మ‌ధ్యాహ్నం మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కార‌ణంగా నిన్న (బుధ‌వారం) సీఎం కేసీఆర్‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వ్య‌క్తిగ‌త వైద్యుల సూచ‌న మేర‌కు ఇవాళ (గురువారం) మ‌రికొన్ని ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌ య‌శోద ఆస్ప‌త్రికి మ‌ధ్యాహ్నం వెళ్ల‌నున్నారు. ఎంఆర్ఐ, సిటీస్కాన్‌తో పాటు త‌దిత‌ర ప‌రీక్ష‌లు సీఎం చేయించుకోనున్నారు. ఈ ప‌రీక్ష‌ల కోసమే ఆయ‌న య‌శోద ఆస్ప‌త్రికి వెళ్లారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రి కెటిఆర్‌, ఎంపి సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ క‌విత ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.