సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

హైదరాబాద్‌ : సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్ (52) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైద‌రాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. నర్సింగ్‌ యాదవ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేమీలు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. నర్సింగ్‌ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్‌, కొడుకు రుత్విక్‌ యాదవ్‌ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.