సిరీస్‌ మనదే.. కానీ, క్లీన్‌స్వీప్ మిస్

12 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలాయా విజ‌యం

సిడ్నీ : ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది.187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 85 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ ఎవరు చెప్పుకోదగిన విధంగా ఆడలేకపోయారు. ఆసీస్‌ విధించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కోల్పోయింది.

టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఒంటరిపోరాటం చేశారు. 61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగి 85 పరుగులు చేసిన కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 28 పరుగులు చేయగా చివర్లో హార్దిక్‌ పాండ్య 20 పరుగులతో పరవాలేదనిపించాడు. ఇతర బ్యాట్స్‌మన్స్ రాణించలేకపోవడంతో 174 పరుగులకు పరిమితమైన టీమిండియా 12 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. లాస్ట్ మ్యాచ్ గెలిచి క్లీన్‌స్వీప్ కాకుండా చూసి పరువు నిలుపుకున్నారు కంగారులు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్వేపన్‌ 3, మ్యాక్స్‌వెల్‌, అండ్రూ టై, జంపా, అబాట్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Leave A Reply

Your email address will not be published.