సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఊరట

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా టెస్టుల అంశంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు.. కాగా, తమ ఆదేశాలు పాటించలేదని.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌కు శ్రీనివాసరావుకు ఇటీవల రాష్ట్ర హైకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ వాదనలు విన్న సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులపై స్టే ఇచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్‌కు ఊరట దక్కింది. అయితే, తెలంగాణలో కరోనా టెస్ట్ లు, రోజువారి రిపోర్టులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు పలు సార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.