`సుప్రీం` తీర్పు నేపథ్యంలో ఎపి పంచాయతీ ఎన్నికలు రీషెడ్యూల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఎస్ఈసీ రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. కాగా మొదటి దశగా ఈ నెల 29న నుండి నామినేషన్ల స్వీకరణ చేపట్టింది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.