సెప్టెంబన్‌ 10న ఐఏఎఫ్‌లోకి రఫేల్‌ యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ‌ : ప‌్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంమైన యుద్ధ‌విమానాలు రఫెల్‌. ఇవి భార‌త్ కొనుగోలు చేయ‌డంతో భార‌త వాయుసేన ఎంతో బ‌లోపేత‌మైన విష‌యంలో తెలిసిందే. అవి సెప్టెంబర్ 10న‌ అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. ఇది శుభ‌వార్తే కాదా. కాగా జూలై నెలలో ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న ఐదు రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10న అంబాలాలోని ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐదు రఫేల్‌ జెట్స్‌ను అధికారికంగా ఐఏఎఫ్‌కు అప్పగించనున్నారు. రఫేల్‌ విమానాలను ఐఎఫ్‌ఏకు అప్పగించే వేడుకనను ఘనంగా నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అంబాలలో జరిగే కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు త్రివిధ దళాల జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా ఉన్నతస్థాయి సైన్యాధికారులు, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్టీ కూడా పాల్గొననున్నారు. 2016లో 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రూ.58వేల కోట్లతో భారత ప్రభుత్వం.. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
కాగా రోజు రోజుకు పొరుగుదేశం చైనా క‌య్యానికి కాలుదువ్వుతోంది. సరిహద్దులో ఉద్రిక్తతలు ఎంతకీ తగ్గకపోవడం, ఎల్ఏసీ వెంబడి చైనా యుద్ధ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్న సమయంలో ఎయిర్ ఫోర్స్‌లోకి రఫేల్‌ విమానాలు చేరుతుండడం భారత వాయుసేనకు బలం చేకూర్చినట్లవుతుందని రక్షణ రంగం నిపుణులు పేర్కొంటున్నారు.

కాగా తొలిదశలో జూలై 29న అంబాలా వైమానిక స్థావరానికి ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. అక్టోబర్‌లో రెండో విడతలో నాలుగు యుద్ధ విమానాలు రానున్నాయి. గగనతంలో వేగంగా ప్రయాణిస్తూ, భూమి మీద ఉన్న టార్గెట్లను కచ్చితత్వంతో ఛేదించడం, ఎయిర్ టూ ఎయిర్ ఫైట్ లోనూ ధీటుగా వ్యవహరించడం, దీర్ఘ శ్రేణి రాకెట్లను కూడా మోసుకెళ్లే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు రఫేల్‌ సొంతం.

Leave A Reply

Your email address will not be published.