స్కూళ్ల రీఓపెనింగ్‌పై వెనక్కి తగ్గిన సర్కార్

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. నిజానికి ఈ సోమవారం నుంచి పాఠశాలలు తెర్చుకోవాలి.. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లను, స్కూళ్లలోని హాస్టళ్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం అనుకుంది.. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.. స్కూళ్లను ఇప్పట్లో తెరవబోమంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఎప్పుడు తెరుస్తామనే విషయాన్ని త్వరలో చెబుతామన్నారు. కరోనా పరిస్థితుల%
Comments are closed.