స్తంభించిన ముంబయి నగరం
ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయి స్తంభించిపోయింది. మహానగరంలో సోమవారం అంధకారం అలుముకుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్ అంతరాయంతో మెట్రో, సబర్బన్ రైళ్లు నిలిచిపోయాయి. ఆస్పత్రుల కోసం అత్యవసరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. మహానగరంలో భారీ స్ధాయిలో విద్యుత్ వ్యవస్థ వైఫల్యం అసాధారణమైనదిగా చెబుతున్నారు. ముంబయి, ఠాణే సహా మహారాష్ట్రలోని పాల్ఘడ్,రాయ్‌గఢ్ జిల్లాలో పాటు చాలాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నగరానికి విద్యుత్ సరఫరా వైఫల్యంతో ఈ పరిస్థితి నెలకొందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని బృహన్ ముంబై విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థ (బెస్ట్) ట్వీట్ చేసింది. సౌత్, సెంట్రల్, నార్త్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సంపూర్ణంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
అయితే ఆ ఎలక్ట్రిక్ లైన్‌ను పునరుద్దరిస్తున్నారు. పవర్‌గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. ఎంఐడీసీ, పాల్గర్, దహనూ లైన్లలో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముంబై నగరానికి వెళ్తున్న 360 మెగా వాట్ల పవర్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మాత్రం ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. కానీ పలు రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రిక్ సరఫరా లేక రైళ్లు ఆగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కొన్ని క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
#MumbaiPowerCut | Commuters seen waiting at Mulund Station as train services are disrupted due to power outage after a grid failure.
(ANI) pic.twitter.com/n10dOY4kOw
— HTMumbai (@HTMumbai) October 12, 2020