స్నేహితురాలితో శర్వానంద్‌ పెళ్లి?

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ క‌రోనా లాక్‌డౌన్‌లో.. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగా…హీరోలు రానా, నితిన్, నిఖిల్ తదితరులు వివాహ బంధంతో కొత్త జీవితాలు మొదలుపెట్టారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం జరిగింది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌నే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తన చిన్ననాటి స్నేహితురాలైన ఓ యువ పారిశ్రామికవేత్తతో శర్వా కొద్ది కాలంగా ప్రేమయాణం సాగిస్తున్నాడట. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలిపారట. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త‌లో నిజా నిజాలు తెలియాలంటే యువ‌న‌టుడు శ‌ర్వానంద్‌ నోరు స్పందించాల్సిందే. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, పూర్తిగా పెద్దల చేతిలో వ్యవహారమని శర్వానంద్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.