సక్సెస్: తొలి రోజు 1.65 లక్షల మందికి టీకా..

న్యూఢిల్లీ: ఇవాళ (శనివారం) దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో 1,65,714 మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. టీకా వేసే కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించింది. ఇవాళ దేశవ్యాప్తంగా 3,351 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ రెండు టీకాలను వేసినట్లు వెల్లడించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ 12 రాష్ట్రాలకు సరఫరా అయ్యినట్లు చెప్పింది. కాగా తొలి రోజు (ఇవాళ) వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న వారు ఎవరూ కూడా టీకా అనంతరం ఆసుపత్రుల్లో చేరిన సంఘటనలు లేవని పేర్కొంది.