హరీశ్ రావుకు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధ‌ర‌ణ అయింది.  లింది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్వహించిన కరోనా పరీక్షల్లో హరీశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. తాను బానే ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన ప్రజాప్రతినిధులు, అధికారులను కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.