హైదరాబాద్‌లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు!

హైదరాబాద్ : దాదాపు ప‌దేళ్ల కింద‌ట హైద‌రాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేవి. త్వరలోనే మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు హైద‌రాబాద్‌లో రోడ్డెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ బ‌స్సుల‌పై తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ కేటీఆర్ శనివారం నాడు ఓ ట్వీట్ చేశారు. డబుల్ డెక్కర్ బస్సులతో తనకు ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయని.. ఆబిడ్స్‌లోని సెంట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఈ బస్సులో వెళ్ళేవాడినని గుర్తు చేసుకున్నారు.

ఒక‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌తో న‌డిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు. హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులను ప్ర‌యాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాల‌ని షాకీర్ హుస్సేన్ కేటీఆర్‌ను కోరారు.

అయితే ఈ బస్సులు నగరం నుంచి ఎందుకు ఆపేశారో తెలియదని ట్వీట్ చేశారు. వీటిని తిరిగి తెచ్చేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో..? పరిశీలించమని కేటీఆర్ తన ట్వీట్ ద్వారా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ ఆజయ్‌ కుమార్‌ను కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.