హైద‌రాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌ (CLiC2NEWS): హైదరాబాద్‌లోపలు ప్రాంతాల్లో ఆదివారం ప‌లు చోట్ల వ‌ర్షం కురిసింది. మ‌ధ్యాహ్నం త‌ర్వాత న‌గ‌రంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప‌లు చోట్ల కురిసింది. రాజేంద్ర నగర్‌, అత్తాపూర్‌, బండ్లగూడ జాగీర్ జాగీర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్‌, శంషాబాద్‌, గగన్‌పహాడ్‌, లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, ఛత్రినాక, బార్కస్‌, గాజులరామారం, షాపూర్‌ నగర్‌ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ఈ వ‌ర్షంతో రోడ్ల‌పై నీరు నిలిచిపోయింది. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది.

Leave A Reply

Your email address will not be published.