అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ హేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ధోనీ ప్రకటించాడు.తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు.
ఇన్నాళ్లూ తనకు మద్దతిచ్చిన అభిమానులకు ధోనీ ధన్యవాదాలు తెలిపాడు. భారత క్రికెట్‌కు ధోనీ రెండు దశాబ్దాల పాటు సేవలందించాడు. టీమిండియా తరపున ధోనీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. భారత క్రికెట్‌కు టీ20, వన్డే ప్రపంచకప్‌లను అందించి అందరి ఆదరాభిమానాలను పొందాడు.
ధోని సారథ్యంలో టీమిండియా వన్డే, టీ-20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి సాధించింది. గతంలోనే టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన ధోని, టీ-20 వన్డే, జట్లలో ఆటగాడిగా కొనసాగాడు. ధోని అనూహ్య నిర్ణయంతో యావత్ క్రీడా లోకం ఆశ్చర్యంలో మునిగింది. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉన్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే.
క్రికెట్‌కు ఎనలేని కృషి
39 ఏళ్ల మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో పలు సంచలన రికార్డులు నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను నెంబర్ 1 స్థానానికి చేర్చడంలో రాంచీ డైనమెట్ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, కెప్టెన్‌గా ధోనీ టీమిండియాకు ఎనలేని కృషి చేశాడు. 2004, డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌లో టీమిండియా జట్టులోకి ధోని అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోని పరుగులేమీ చేయకుండా రనౌట్ కావడం విశేషం.
ఇక 2005లో శ్రీలంకతో మ్యాచ్‌లో ధోని తొలి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ధోని చివరి సారిగా 2019, జులై 19న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోని 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ 20 మ్యాచ్‌లలో 1600 పరుగుల సాధించాడు.
ప్రపంచకప్ గెలవడం మరచిపోలేదుః సచిన్
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంపై సచిన్ టెండూల్కర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘ధోనీ భారత క్రికెట్‌కు నీవు గొప్ప సేవ చేశావు. నీతో కలిసి 2011 ప్రపంచకప్ గెలవడం నా జీవితంలో మరపురాని క్షణం. రిటైర్మెంట్ తరువాత కూడా నీవు, నీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ద బెస్ట్’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు.
విరాట్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ప్రతి క్రికెటర్ ఒక రోజు తన ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుందని, అయితే.. మీకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే మరింత ఎక్కువగా భావోద్వేగానికి గురవుతారని ధోనీ రిటైర్మెంట్‌పై కోహ్లీ ట్వీట్ చేశాడు. దేశం కోసం నువ్వు అందించిన సేవ ప్రతీ ఒక్కరి హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని కోహ్లీ ట్వీట్ చేశాడు.
ధోనీ ట్రాక్ రికార్డ్
- 11 ఏళ్ల పాటు టీమిండియాకు సేవలందించిన ధోనీ
- 2004 డిసెంబర్ 23న మహేంద్రసింగ్ ధోనీ తొలి వన్డే మ్యాచ్
- విశాఖ సూపర్ ఇన్నింగ్స్‌తో స్టార్‌గా మారిన ధోనీ
- 2007లో మహేంద్రసింగ్ ధోనీకి కెప్టెన్సీ పగ్గాలు
- 2014లోనే టెస్టుల నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోనీ
- గతేడాది వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ధోనీ చివరి మ్యాచ్
- 2007-08లో ఎం.ఎస్.ధోనీకి రాజీవ్ ఖేల్‌రత్న
- 2009లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న ధోనీ
- 350 వన్డేల్లో 10,773 పరుగులు చేసిన ధోనీ
- 90 టెస్టుల్లో 4,876 పరుగులు, 98 టీ-20 మ్యాచ్‌ల్లో 1,617 పరుగులు
- వన్డేల్లో ధోనీ అత్యధిక స్కోర్ 183 నాటౌట్
- టెస్టుల్లో అత్యధిక స్కోర్ 224, టీ-20లో అత్యధిక స్కోర్ 56
- టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ
- వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ
- టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు, వన్డేల్లో 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్‌లు
- టీ-20ల్లో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్‌లు
- 2007లో టీ-20, 2011లో వన్డే వరల్డ్ కప్‌లు, 2013లో ఛాంపియన్ ట్రోఫీ అందుకున్న ధోనీ
- 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ధోనీ రికార్డ్
- మూడు ఫార్మాట్లలో భారత్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ధోనీ
- ఐపీఎల్‌లో ధోనీకి తిరుగులేని రికార్డ్
- ధోనీ నాయకత్వంలో 3 సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్