అది దేశద్రోహం ఎలా అవుతుంది.. ఫరూక్‌కు సుప్రీం ఊరట
పిటిషనర్‌కు రూ.50 వేల జరిమానా
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై గతంలో ఫరూక్ చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించినంతమాత్రానా దేశ ద్రోహంగా పేర్కొనలేమని తెలిపింది.
జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై ఫరూక్.. పాకిస్థాన్, చైనా మద్దతు కోరినట్లు పిటిషనర్ ఆధారాలు సమర్పించలేకపోయారని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిపై రూ. 50 వేల జరిమానా కూడా విధించింది.