అనసూయ మాస్ డాన్స్.. స్టిల్స్ హల్‌చల్..!
హీరో కర్తికేయ మొదటి సినిమా `ఆర్ఎక్స్ 100`తో యూత్‌ను అట్రాక్ట్ చేశాడు. ప్రస్తుతం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన తాజా చిత్రం ‘చావుకబురు చల్లగా’ అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. పైనపటారం..ఈడ లోన లొటారం..విను బాసు చెబతాను లోకం వయ్యారం’ అంటూ సాగే ఈ సాంగ్‌లో అనసూయ ఫుల్ అవుడ్ అండ్ అవుట్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.