‘అన్నయ్య’ త్వరగా కోలుకోవాలి : పవన్

హైద‌రాబాద్‌: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చిరంజీవి హోం క్వారంటైన్ లో ఉన్నారు. చిరంజీవి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. అన్న‌య్య చిరంజీవి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ కల్యాణ్ ఆకాంక్షిస్తూ భావోద్వేగ సందేశాన్ని ట్విట‌ర్ లో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారని చెప్పారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. అన్నయ్య కరోనా బారినపడటంతో తామంతా విస్తుపోయామని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.‌

 

Leave A Reply

Your email address will not be published.