అన్నయ్య నా విజయాన్ని కోరుకుంటారు: పవన్
అమరావతి: కులాలను ఓటు బ్యాకుగా పరిగణించే కొద్దీ ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర జనాభాలో 27శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడటాన్ని ప్రతి రాజకీయ పార్టీ మానేయాలని ఆయన హితవు పలికారు. కాపు సంక్షేమ సేన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఓ కులాని ప్రతినిధిని కాదని.. అందరివాడినని చెప్పారు. కాపులపై ఉన్న కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు.
తన సోదరుడు చిరంజీవి తన విజయాన్ని కోరుకుంటారని, అందరూ బాగుండాలని తపన పడుతుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. చిరంజీవి రాజకీయ దారి ఎలా ఉన్నా గౌరవిస్తానన్నారు. ఆయన పార్టీలోకి వస్తారా.. లేదా అనేది ఈ రోజు చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం అని పవన్ అన్నారు.