అన్నాత్తె సెట్ నుండి ర‌జనీకాంత్ లుక్ ఔట్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్..  శివ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాత్తె అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో ప్ర‌స్తుతం కీలక షెడ్యూల్ జ‌రుపుతుండ‌గా, వీలైనంత త్వ‌ర‌గా మూవీ షూటింగ్ పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యాక త‌లైవా రాజ‌కీయాల‌తో బిజీ కానున్నారు. అన్నాత్తై చిత్రంలో ర‌జ‌నీకాంత్‌తో పాటు కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం రీసెంట్‌గా ఆయ‌న తమిళ‌నాడు నుండి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. త‌న బ‌ర్త్‌డే రోజు ర‌జ‌నీకాంత్ ఫ్లైట్‌లో హైద‌రాబాద్‌కు రాగా,  విమానంలో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రిపించి ఔరా అనిపించారు. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రోవైపు ర‌జ‌నీకాంత్ సెట్‌లో ఉన్న ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ గెట‌ప్‌ని చూసి అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.