అప్రమత్తంగా ఉండాలి
విద్యుత్ శాఖకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బుధవారం ట్రాన్స్‌కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్‌శాఖ పరిస్థితిపై సిఎం కెసిఆర్ సమీక్షించారు. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని అభినందించారు.
వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిపై సీఎంకు విద్యుత్ సంస్థ సీఎండీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వరదలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయని, స్తంభాలు దెబ్బతిన్నాయని, వైర్లు తెగిపోయాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వానలు, వరదల ఉధృతి తగ్గలేదని, జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదన్నారు. ఎక్కడి వరకు సిబ్బంది చేరుకోగలుగుతున్నారో అక్కడి వరకు వెళ్లి 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు సీఎండీ ముఖ్యమంత్రికి వివరించారు.
రెండు రోజులు అప్రమత్తంగా ఉండండి : కేటీఆర్
హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముంపు బాధితుల సమస్యలను కేటీఆర్ ఓపికగా అడిగి తెలుసుకుంటున్నారు. ముసారాంబాగ్‌లోని సలీంనగర్లో బుధవారం మధ్యాహ్నం కేటీఆర్ పర్యటించి.. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. వానలు తగ్గే సూచన లేదు. ఇప్పుడు ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.. మరో రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉండాలని ముంపు బాధితులకు కేటీఆర్ సూచించారు. బాధితులందరికి వైద్య పరీక్షలు చేయిస్తాము, భోజనం పెడుతామన్నారు. దుప్పట్లు కూడా సరఫరా చేస్తామన్నారు. వీటితో పాటు నష్ట పరిహారం కూడా చెల్లిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
మూసారంబాగ్ లోని సలీంనగర్ ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి @KTRTRS
రానున్న 1, 2 రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో @GHMCOnline ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఉండాలని, అక్కడ ఆహారంతో పాటు, మందులు, వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపిన మంత్రి pic.twitter.com/jTKK0lqqY0
— Konatham Dileep (@KonathamDileep) October 14, 2020
రెండు రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ సంస్థలు, ఫినాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్కు నేడు, రేపు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం ఈ సెలవుపు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం మినహాయింపు ఉన్నట్లు తెలిపారు.
[…] అప్రమత్తంగా ఉండాలి […]