అభిమానితో విడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ చొరవ, ఫ్యాన్స్‌ ఫిదా!

హైదరాబాద్‌: అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అభిమానుల‌ను క‌లిసి `మీకు మేమున్నాం` అంటూ వారిలో ధైర్యాన్ని నింపిన సినీ తార‌లు ఎంద‌రో ఉన్నారు. అభిమానులు, వారి కుటుంబాలు బాగుండాల‌ని ఎప్పుడూ జాగ్ర‌త్త‌లు చెబుతుంటారు అగ్ర‌క‌థానాయ‌కుడు ఎన్టీఆర్‌. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. గతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఫ్యాన్‌ను పలకరించి అతనికి భారీ ఓదార్పునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో యంగ్‌ టైగర్‌ చూపించిన మానవత్వం, అభిమానంపై ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మస్క్యులర్‌ డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమాని వెంకన్న అనారోగ్యం గురించి తెలుసుకున్నారు. వీడియో కాల్‌ ద్వారా ఎన్టీఆర్‌ వెంకన్నను పలకరించారు. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఎన్టీఆర్‌తో సెల్ఫీ తీసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అతని మాటలను ఓపికగా విన్న ఎన్టీఆర్‌ పరిస్థితులన్నీ చక్కబడిన వెంటనే అతడిని కలవడానికి వస్తానని అప్పుడు తనతో సెల్ఫీ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తర్వాత వెంకన్న తల్లితో ఎన్టీఆర్‌ మాట్లాడారు. నాకు వీలైన సహకారం అందిస్తానని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.