అభివృద్ధిప‌థంలో బిహార్‌

నవ భారత నిర్మాణానికి నితీశ్ గొప్ప కృషి : మోదీ

న్యూఢిల్లీ :బిహార్‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ శ్ర‌మిస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో బిహార్‌లో జరిగే శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే సారథి నితీశ్ అని చెప్పకనే చెప్పారు. నవ భారతం, నవ్య బిహార్ కోసం నితీశ్ విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో అనేక సంవత్సరాల పాటు బిహార్ వెనుకబడిందని, రాజకీయాలు, నిధుల కొరత దీనికి కారణాలని మోదీ చెప్పారు. రోడ్ల అనుసంధానం, ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి చర్చ జరగని రోజులు ఉండేవన్నారు. అన్ని వైపులా భూమి ఉన్న ఈ రాష్ట్రం అనేక సవాళ్ళను ఎదుర్కొందని చెప్పారు. నవ భారతం, నవ్య బిహార్ కోసం మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించడంలో నితీశ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాల స‌హాయ‌స‌హాకారాలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసిన పెట్రోలియం శాఖ‌కు చెందిన రూ. 900 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టుల‌ను ఆయ‌న వీడియో కాన్ష‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ సిఎ నితీశ్‌ను మెచ్చుకున్నారు. న‌వ‌భార‌త్‌, న‌వ బిహార్ దిశ‌గా బిహార్ అడుగులు వేస్తోంద‌ని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఒకప్పుడు నితీశ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2013లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి వైదొలగారు. 2015లో జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల్లో మోదీ, నితీశ్

Comments are closed.