అమెరికాలో ఇక మాస్కు అక్క‌ర్లేదు!

న్యూయార్క్ (CLiC2NEWS): కరోనా వైరస్ వ్యాక్సిన్లు తీసుకున్న అమెరికన్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని సెంట‌ర్‌ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సిడిసి) మంగ‌ళ‌వారం స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. అయితే జన సందోహాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాస్కులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. సిడిసి గైడ్ లైన్స్ విడుదల చేస్తూ పూర్తిగా (రెండు సార్లు) వ్యాక్సిన్ తీసుకున్నవారు నిరభ్యంతరంగా బయట తిరగవచ్చునని, పాండమిక్ సమయంలో తాము ఆపివేసిన పనులను ఇప్పుడు పూర్తి చేసుకోవచ్చునని పేర్కొంది. ఒంట‌రిగా గానీ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి న‌డ‌క‌కు, వాహనాల‌పై షికార్లు చేయొచ్చ‌ని చెప్పింది. కానీ సినిమా థియేటర్లు, పెద్ద ఈవెంట్లు తదితర భారీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాస్కులు వాడాల్సిందే అని స్ప‌ష్టం చేసింది. అమెరికన్లలో సగానికి పైగా జనాభా ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.