అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగులో బ్యాలెట్ పత్రాలు..

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు పట్టం కట్టారు. ఇది మన తెలుగు వారందరికి గర్వకారణం. నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ ప్రతాల్ని తెలుగులో ముద్రించనుంది. ఈ మేరకు ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసకుంది. ఇది అమెరికాలో తెలుగు భాషకు దక్కిన అరుదైన గౌరవం. దీని పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ప్రవాస భారతీయులు అధికమన్న విషయం తెలిసిందే.. వారిలో మన తెలుగువారు పెద్దమొత్తంలోనే ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రపంచ భాషల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తారు. ఇప్పుడు వాటి సరసన తెలుగు కూడా చేరింది. అమెరికాలో తెలుగు భాషను అధికార భాషగా గుర్తించడం ద్వారా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది. అమెరికాలో జరిగిఏ అధికార కార్యకలాపాల వివరాలను కూడా తెలుగులో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. దీనిపై తెలుగువారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.