అమెరికా అధ్య‌క్ష పీఠం బైడెన్‌దే!

ఉత్కంఠ పోరులో జో బిడెన్ గెలుపు

వాషింగ్టన్: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కొన్ని రోజులుగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అగ్ర‌రాజ్య నూత‌న అధ్యక్షుడిగా డెమొక్ర‌టిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విజ‌యం సాధించారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 538 ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్ల‌కు గాను ఆయ‌న 284 ఓట్లు సాధించిన‌ట్లు అసోసియేట్ ప్రెస్ వార్తా సంస్థ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో ట్రంప్‌కు ఇప్పటివరకూ 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉంగా.. అక్కడ జో బిడెన్ ఆధిక్యం కనబర్చడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. జో బిడెన్‌కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో.. 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికయ్యారు. అంతేకాదు, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

 

Leave A Reply

Your email address will not be published.