అరకులో బస్సు బోల్తా.. నలుగురు మృతి

అరకు: విహార యాత్ర విషాద యాత్రగా ముగిసింది. విశాఖ జిల్లా అరకు లోయలో జరిగిన ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అనంతగిరి మండలం డముకలోని ఐదో నంబర్ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అరకులు వెళ్లిన పర్యాటకులు తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డుముకు వద్ద 80 అడుగుల లోయలో బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. కాగా క్షతగాత్రులను విజయనగరం జిల్లా ఎస్.కోట దవఖానాకు తరలించారు. ప్రమాద సమయంలో 30 మంది పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారిగానే చెబుతున్నారు పోలీసులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కంట్రోల్ రూం నెంబర్లు 08912590102;0891259010.